calender_icon.png 1 May, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీఎస్‌ఈ పది, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలు విడుదల

01-05-2025 02:07:59 AM

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): 2025 సంవత్సరానికి గానూ ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. 2025 సంవత్సరా నికి గానూ ఐసీఎస్‌ఈ కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ ఈ ఫలితాలను బుధవారం రిలీజ్ చేసింది.

ఫిబ్రవరి 18 నుంచి మార్చి 27వరకు ఐసీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు జరగ్గా, ఐఎస్సీ 12వ తరగతి పరీక్షలను ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్‌తో పాటు క్యాప్చా కోడ్‌ను పొందుపరిచి ఫలితాలు పొందొచ్చని తెలిపింది.