26-08-2025 03:07:17 PM
పేద విద్యార్థులకు చేయూత
సదాశివనగర్,(విజయక్రాంతి): పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అండగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ ఆంగ్ల మాధ్యమం బోధించే ఉపాధ్యాయుడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన బి రాజేశ్వర్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు అండగా ఉంటూ అందరి మన్నానలు పొందుతున్నాడు. పాఠశాలలో చదివే 80 మంది విద్యార్థులకు షూ,బెల్టు,టై ఉచితంగా అందజేశారు.
పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పాయల్ అనే విద్యార్థిని ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నందున 2000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి తో పాటు తోటి ఉపాధ్యాయులు పాఠశాలకు, విద్యార్థులకు అన్ని విధాల సహాయ సహకారాలు లందిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు రాజేశ్వర్ ను అభినందనలు తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించడం కోసమే ఉపాధ్యాయుడు రాజేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగే విద్యార్థిని విద్యార్థులు పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వస్తారు కనుక వారికి ప్రోత్సహం కలిగించడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నను. విద్యార్థులు, ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తు ఎంచుకోవాలని సూచించారు.