calender_icon.png 26 August, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో విజృంభిస్తున్న జ్వరాలు...!

26-08-2025 04:58:14 PM

జ్వర పీడితులతో కిక్కిరిసిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి 

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి(Bellampalli) జ్వరాలతో విలవిల్లాడుతుంది. బెల్లంపల్లి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో అనేకమంది జ్వరాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక చికిత్స కేంద్రాల వద్ద జ్వర పీడితుల తాకిడి అధికంగా ఉంది. బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మంగళవారం జ్వర పీడితులతో కిక్కిరిసి పోయింది. మంగళవారం ఒక్కరోజే ఈ ఆసుపత్రికి 600 కు పైగా రోగులు చికిత్స కోసం రాగా అందులో 400 మందికి పైగా జ్వరం సోకిన వారే ఉండడం గమనార్హం. 200కు పైగా జ్వర పీడితులు ఈ ప్రాంతీయ ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్సలు పొందుతున్నారు. చాలీచాలని వైద్యులు, సిబ్బంది ఉన్నప్పటికీ ఈ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని జ్వర పీడితులు తెలిపారు. జ్వర పిడుతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఏరియా ఆసుపత్రిలో 100 బెడ్లు మాత్రమే ఉన్నప్పటికీ 136 మందిని ఇన్ పేషెంట్లుగా చేర్చుకొని అత్యవసర వైద్య చికిత్సలను అందిస్తున్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.