calender_icon.png 26 August, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వుమెన్ బ్లూ కోల్ట్’ ప్రారంభం

26-08-2025 04:52:59 PM

జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించిన ఎస్పి.

రేగొండ/భూపాలపల్లి ఆగస్టు 26(విజయ క్రాంతి): భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఉమెన్ బ్లూ కోర్ట్ ను జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రారంభించారు.మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా రూపొందించిన ‘వుమెన్ బ్లూ కోల్ట్, కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, ఎస్పీ కిరణ్ ఖరే జెండా ఊపి స్కూటీ ర్యాలీకి ప్రారంభ సూచన చేశారు.భూపాలపల్లి పోలీస్ స్టేషన్, కాటారం పోలీస్ స్టేషన్, షీ టీమ్స్ నుండి ఎంపికైన మహిళా సిబ్బందికి స్కూటీ లు కేటాయించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి సబ్-డివిజన్ డీఎస్పీ సంపత్ రావు,కాటారం సబ్-డివిజన్ డీఎస్పీ సూర్యనారాయణ రావు, సిఐలు, ఎస్సైలు,ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.