calender_icon.png 26 August, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషపురుగులకు కేరాప్ చండూరు ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి

26-08-2025 05:04:48 PM

రాష్ట్ర ఒబిసి మోర్చా అధికార ప్రతినిధి కోమిటి వీరేశం 

చండూరు,(విజయక్రాంతి): చండూరు ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి విషపురుగులకు కేరాఫ్ నిలయంగా మారిందని రాష్ట్ర ఓబిసి మోర్చా అధికార ప్రతినిధి(State OBC Morcha Spokesperson) కోమిటి వీరేశం అన్నారు. మంగళవారం చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో చండూరు ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి శిథిలా వ్యవస్థలో ఉందని, వెంటనే నూతన భవనాన్ని నిర్మించాలని కోరుతూ బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో చండూరు ఆర్డీవో శ్రీదేవికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం శిథిలా వ్యవస్థకు చేరుకున్న సందర్భంగా ఆ భవనాన్ని కూల్చివేసి, నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రిగా చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబిసి మోర్చా అధికార ప్రతినిధి కోమటి వీరేశం, జిల్లా కౌన్సిల్ సభ్యులు భూతరాజు శ్రీహరి, సింగిల్ విండో డైరెక్టర్ బోడా ఆంజనేయులు, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి అన్నపర్తి యాదగిరి, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి సామ వెంకటరెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఇరిగి ఆంజనేయులు, జిల్లా నాయకులు కళ్లెం సురేందర్ రెడ్డి, తడకమల్ల శ్రీధర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు భూతరాజు స్వామి, సోమ శంకర్, ఉపాధ్యక్షులు కోమటి ఓంకారం, చేనగోని శేఖర్, పార్టీ కోశాధికారి మంచుకొండ సాగర్, పార్టీ కార్యదర్శులు  ముష్టిపల్లి జీవన్ బూత్ అధ్యక్షులు తోకల రవీందర్, చిట్టిపోల వెంకట తదితరులు పాల్గొన్నారు.