26-08-2025 04:56:53 PM
వంతెనకు మరమ్మతులు చేపట్టని అధికారులు
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆసిఫాబాద్ మండలం లోని రాజురా గ్రామ లోలేవల్ వంతెన పై నుంచి వరద ప్రవహించి రోడ్డు కోతకు గురయిన విషయం తెలిసిందే. ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఇటీవల జిల్లా పర్యటనలో భాగంగా వంతెనను పరిశీలించిన మంత్రి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఇప్పటి వరకు ఎటువంటి మరమ్మత్తు పనులు చేపట్ట లేదని తద్వారా రోజు రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు తమ గోడు విలపిస్తున్నారు. మంత్రి మాటకు కూడా విలువ ఇవ్వని అధికారులు జిల్లాలో ఉండడం దురదృష్టకరమైన విషయమని విచారం వ్యక్తం చేస్తున్నారు.