calender_icon.png 26 August, 2025 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 వ రోజుకు చేరిన గిరిజన సంఘాల రిలే నిరాహార దీక్ష

26-08-2025 05:01:17 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): తాండూర్ మండలం(Tandur Mandal) నర్సాపూర్ గ్రామపంచాయతీకి వెళ్లే దారిలో భీమన్న బాబు పై బ్రిడ్జి నిర్మించడంతోపాటు లచ్చు కూడా వద్ద రోడ్యాం నిర్మాణం చేపట్టాలని కోరుతూ గిరిజన అనుబంధ సంఘాల నాయకులు తాండూర్ తాసిల్దార్ కార్యాలయం వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్ష మంగళవారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komuram Bheem Asifabad District) తీర్యాని మండల ఆదివాసి హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ మండల కమిటీ నాయకులు సంఘీభావం తెలిపారు.

అధికారులకు తమ సమస్యలను తెలిపినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. నర్సాపూర్ నుండి బెజ్జాల వరకు రోడ్డు పనులను అటవీశాఖ అధికారులు ఆపడం జరిగిందని, అనుమతులు వచ్చేవరకు నిరాహార దీక్షను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా తుడుం దెబ్బ, రాయి సెంటర్, గిరిజన అనుబంధ సంఘాల నాయకులు పెందూరు ధర్ము, గేడెం సుభాష్, కొట్నాక బారికరావు, తొడసం భాస్కర్, గెడెం సోనేరావు, కురిసింగ బాబురావు, బొజ్జి రావు తదితరులు పాల్గొన్నారు.