calender_icon.png 26 August, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేలి ముద్రలకు సెలవు...

26-08-2025 03:37:19 PM

ముఖ గుర్తింపుతో పింఛన్ల పంపిణీ..

పరికరాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. 

రేగొండ/భూపాలపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వం పేదలతో పాటు చేతి వృత్తులకు పింఛన్ అందజేస్తుంది. అయితే వయసు మీద పడిన వృద్ధులకు చేతివేళ్లు ముడతలు పడడంతో వేలిముద్రలు పడక పింఛన్ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తేవి. ఇకపై ఫించన్ దారులు బయోమెట్రిక్ ఆదారిత ఇబ్బందులు లేకుండా తాము ఎక్కడున్నా ఒక గుర్తింపు ద్వారా పింఛన్ పొందే అవకాశం కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ఈ మేరకు కలెక్టర్ సోమవారం ఐడిఓసి కార్యాలయంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో పోస్ట్ మాస్టరుల కు పింఛన్ ఇవ్వడానికి అవసరమైన 89 ముఖ గుర్తింపు పరికారాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగులు తదితర పింఛను దారులకు ఇది ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా ఫించను చెల్లింపుకు ఉపయోగించే ఆధునిక పరికరాలు వినియోగించనున్నట్లు అన్నారు.దీంతో పింఛన్ చెల్లింపులలో పారదర్శకత, వేగం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డి ఆర్ డి ఓ బాలకృష్ణ, ఆర్డీవో రవి, తదితరులు పాల్గొన్నారు.