30-04-2025 05:55:16 PM
మందమర్రి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాల్లో మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల 95% ఫలితాలు సాధించిందని పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ తెలిపారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించి ఆమె మాట్లాడారు. పదో తరగతి విద్యార్థిని చెల్పూరి సిరి 566 మార్కులతో పాఠశాల స్థాయిలో మొదటి స్థానంలో నిలువగా, రెండవ స్థానంలో 559 మార్కులతో తాండ్ర అక్షర దీపిక, కుడిదల అశ్విక్ తేజ నిలిచారు. 34 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారని అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు. ఉత్తమ ఫలితాల సాధనకు మెరుగైన విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులకు, సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.