30-04-2025 06:00:36 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల విద్యాధికారి పిడతల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉన్నత పాఠశాలల, గురుకుల స్కూల్, మోడల్ స్కూల్, కేజీబీవీ స్కూల్, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పదో తరగతిలో 100% వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
మునగాల మండలం నుండి 383 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుగా 377 మంది విద్యార్థులు పాసయ్యారు. కేవలం ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఫెయిల్ అయ్యారు. 371 మంది పాస్ అయ్యారు. మండల పర్సంటేజీ 98.4/-ఉన్నది. ఇందులో న్యూ ప్రజ్ఞా స్కూల్ 560, గురుకుల స్కూల్ 541, కేజీబీవీ స్కూల్ 530, మోడల్ స్కూల్ 525 మార్కులతో మండలంలో టాప్ గా తూముల ముని మేఘన (560) ఉన్నారు. మండల విద్యాధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు.