03-07-2025 12:09:32 AM
మహబూబ్ నగర్ జూలై 2 (విజయక్రాం తి): దాతలు రోడ్డు వేస్తే దర్జాగా బిల్లు లు పెట్టుకొని డబ్బులు దండుకునేలా కొంద రు అధికార పార్టీ నేతలు ఆత్రుత కనబరుచుతున్నారు. అధికారంలో మేమే ఉన్నాము క దా.. మమ్మల్ని అడిగేది ఎవరు..? మేము పెట్టిన బిల్లులు ఆపేదెవరు..? అనుకున్నారు ఏమో తెలియదు కానీ.. అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామంలో ఓ కంపెనీ యాజమాన్యం మట్టిరోడు వేస్తే మేమే వేసినమం టూ నేరుగా సంబంధిత అధికారులు చేత ఎంబి చేయించుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.
సమగ్ర విచారణ చేసి సంబం ధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఎస్‌ఈ విజయ్ కుమార్ కు పొన్నకల్ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు ఆపాలంటూ ఆ గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యా దు చేసిన సంఘటన చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాశమైంది.
- స్నేహ కంపెనీ.. మట్టి రోడ్డు నిర్మాణం...
పొన్నకల్ గ్రామంలో చౌట చెరువులో రో డ్డు నిర్మాణం కోసం స్నేహ కంపెనీ మోరం మట్టి ని తరలించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మట్టి తరలింపు కోసం స్నేహ కంపెనీ యాజమాన్యం గ్రామంలోని దేవాలయనికి సైతం పెయింట్ వేపియడం జరి గింది. దీంతోపాటు దాసరపల్లి వరకు మట్టి రోడ్డును వేపించారు. ఆ గ్రామ సమీపంలో స్నేహ కంపెనీ ఉండడంతో కంపెనీ యాజమాన్యం చిన్న చిన్న పనులకు తోడ్పాటును అందిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ విషయాలపై అధికారులకు తెలిసినప్పటి కీ అధికారులు అధికార పార్టీ నేతలు చెప్పిన విధంగా ఎంపీలు చేస్తూ ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తే ఉన్నత అధికారులకు ఫి ర్యాదు చేస్తామని గ్రామస్తులు గట్టిగా చెబుతున్నారు. అవినీతి అక్రమాలకు తావు లే కుండా ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి గురి కాకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని ఆ గ్రా మంలోని కొందరు పేర్కొంటున్నారు.
- ఎంబి రికారడ్స్ చేపించారు....
ప్రజలకు పారదర్శకంగా పాలన అందించాల్సిన ప్రభుత్వం.. దాతలు పనులు చేస్తే ద ర్జాగా గ్రామ అధికార పార్టీ పాలకులమం టూ ప్రచారం చేసుకుంటూ బిల్లులు ఎలా పెడతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు సైతం అధికార పార్టీ నేతలు ఉంటే వారికి మద్దతు పలుకుతారని ప్రశ్నలకు మ రింత పదును చేకూరుతుంది. ఎంబి రికార్డు చేసినట్లు అయితే వెంటనే రద్దు చేయాలని పనులు ఎవరు చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నా రు..? ఎప్పుడు చేశారు..?
అనే విషయాలను సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేసి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చే యించాలని కోరారు. గ్రామస్తులు మాత్రం సంబంధిత ఏ ఈ, డీలకు తెలియజేసినప్పటికీ ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి పూర్తిస్థాయి లో పనులు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఫిర్యాదు చేసిన వారి లోగ్రామస్తులు డి. విజయ్ కుమార్ రెడ్డి, సింగ ల్ విండో డైరెక్టర్ కావాలి కృష్ణయ్య , ఎం. నర్సింహా రెడ్డి, డి రంజిత్ రెడ్డి, శంకర్ రెడ్డి , రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
-మట్టి రోడ్డుకు రెండు లక్షల బిల్లు...
పొనకల్ గ్రామంలో వేసిన ఈ రోడ్డుకు సంబంధించి గ్రామపంచాయతీ కార్యదర్శి తీర్మానం చేసి సంబంధిత అధికారులకు నివేదిక అందించారు. ఈ నివేదిక పత్రాన్ని ఆధా రంగా చేసుకుని పంచాయతీరాజ్ శాఖ ఏఈ తీర్మాణ కాపీ తో అగ్రిమెంట్ చేశారు. తీరా ఈ రోడ్డు పూర్తయింది. దీంతో వెను వెంటనే రోడ్డు ఇన్ఫెక్షన్ చేసి రూ 2 లక్షలు ఎంబి చేశారు.
జిఎస్టి తో పాటు ఇతర కట్టింగులు పోను రూ 1 లక్ష 46 వేల బిల్లు ఫైనల్ గా ప్రభు త్వం నుంచి మంజూరు చేసేలా సంబంధిత అధికారి చర్యలు తీసుకున్నారు. ఉన్నట్టుండి గ్రామస్తులే ఈ రోడ్డుకు సంబంధించి రోడ్డు వేసింది స్నేహ కంపెనీ వారిని మీరు ఎలా బిల్లు చేస్తారని సంబంధిత ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
నిబంధనల ప్రకారమే ఎంబీ చేశాను...
ప్రభుత్వాన్నిబంధనల ప్రకారమే పం చాయతీ కార్యదర్శి తీర్మాణ కాపీని పరిగణలోకి తీసుకుంటూ రోడ్డు కావాలని తెలపడంతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. మట్టి రోడ్డును కూడా పూర్తిస్థాయిలో పరిశీలించాం. నిబంధన మేర కు రోడ్డు బాగా ఉండటంతో ఎంబీ రికా ర్డు చేసింది వాస్తవమే.
ఈ రోడ్డుకు సం బంధించి డబ్బులు ఖర్చు పెట్టింది స్నే హ కంపెనీ వారిని తర్వాత తెలిసింది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు త దుపరి చర్యలు తీసుకుంటాం. ఉద్దేశపూర్వకంగా ఇక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయలేదు.
శంకర్ నాయక్, అడ్డాకల్ ఎఈ, పంచాయతీరాజ్ శాఖ,