calender_icon.png 4 July, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం

03-07-2025 12:23:04 AM

ప్రిన్సిపల్ డాక్టర్ చిరంజీవి

ముషీరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): క్రీడల్లో పాల్గొంటూ చదువు కోవడానికి వచ్చే క్రీడాకారుల పట్ల అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. చిరంజీవి తెలిపారు. ఫస్ట్ ఇయర్ లో ఏడాది తాము ఊహించిన కంటే ఎక్కువగా 450 పైగా అడ్మిషన్లు జరిగాయని ఆయన బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఎక్కువ మంది క్రీడాకారులు తమ కళాశాలకు చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆటల్లో చూపే ప్రతిభ పట్టుదల చదువులో కూడా చూపిస్తే భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని క్రీడాకారులకు తెలిపారు. గత ఏడాది తమ కళాశాల క్రీడాకారులు ఆరుగురు జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నారని ఈ ఏడాది ఎక్కువ మంది క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మయ్య కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రసాదరావు క్రీడాకారుల తదితరులు పాల్గొన్నారు.