03-07-2025 12:05:57 AM
సమస్యల పరిష్కారానికి అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే
ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
వనపర్తి, జులై 2 (విజయక్రాంతి): జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి బుధవారం ఫోన్ ఇన్ కార్యక్రమంను నిర్వహించారు. ప్రజల నుండి ఫోన్ ద్వారా ప్రజా సమస్య లను తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చే శారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి ఫో న్ ద్వారా తమ సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే కి వివరించారు.
ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ఆర్‌టిసి బస్సు సౌకర్యం, హిందూ స్మశాన వాటిక స్థలం కేటాయిం పు, వనపర్తి జిల్లా కేంద్రం చుట్టూ అభివృద్ధి చేసే విధంగా చర్యలు, పీర్లగుట్ట చదును, లాంటి అనేక సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరు తనను ఒక కుటుంబ సభ్యుని లాగా భావించాలని తనతో నేరుగా మాట్లాడి సమస్యలను వివరించవచ్చునని ఆయన సూచించారు.
సామాజిక కార్యకర్తను ఎమ్మెల్యే మేఘారెడ్డి
పెద్దమందడి జూలై ౨: వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు బుధవారం నాడు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా నూతనంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమీటీ సభ్యులుగా వెంకట్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ మా సొంత మండలం పక్క గ్రామమైన మద్దిగట్ల వెంకట్ గౌడు గత కొన్ని సంవత్సరాల నుండి సామాజిక కార్యకర్తగా ఎన్నో సేవా కార్యక్రమాల లో పాలుపంచుకొని ప్రజలకు తన వంతు సహకారాన్ని అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలలో పాలుపంచుకొని ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరే విధంగా పత్రిక రంగంలో కూడ తన సేవలను కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు అందించాలని ఆయన కోరారు.