calender_icon.png 29 December, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశం వస్తే జడ్పీటీసీ బరిలో ఉంటా..

29-12-2025 12:39:18 AM

నాగిరెడ్డిపేట్,డిసెంబర్ 28 (విజయక్రాంతి): అవకాశం వస్తే నాగిరెడ్డిపేట మండల జెడ్పిటిసి అభ్యర్థిగా బరిలో ఉంటానని చినూరు గ్రామానికి చెందిన కొండ మీరతాయి తెలిపారు.బీజేపీ కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు మరియు బాణాల లక్ష్మారెడ్డిల ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు.చినుర్ గ్రామానికి చెందిన కొండా మీరాతాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోది  చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పతకాలకు ఆకార్షితులై తను బిజేపిలో చేరానాని అవకాశం వస్తే నాగిరెడ్డిపేట మండల జడ్పిటిసి స్థానానికి బిజెపి తరఫున బరిలో ఉంటానని  ఆమె అన్నారు.

మండలంలో విద్యా వైద్యం మరియు రైతులా సంక్షేమానికి తన వంతుగా సేవా సేవ చేయడానికి ఆసక్తిగా ముందుకు వస్తున్నానని తేలిపారు.ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో  నేరళ్ళ ఆంజనేయులు,రంజిత్ మోహన్,బాపూరెడ్డి,మాజీ ఎమ్మెల్యే అరుణతార,జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు,లింగరావు,జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమాన్లు,విష్ణు,సిద్దు  తదితరులు పాల్గొన్నారు.