calender_icon.png 29 December, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్కాపూర్ సప్తాహలో పాల్గొన్న షిండే

29-12-2025 12:40:46 AM

బిచ్కుంద, డిసెంబర్ 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మల్కాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ హనుమాన్ మందిరం వద్ద నిర్వహించిన సప్త కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు  హన్మంత్ షిండే భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమాధిపతి అంతేశ్వర్ మహారాజ్ గారిని ఘనంగా సన్మానించి, వారి ఆశీర్వాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మమేకమై, సప్త కార్యక్రమం విజయవంతంగా జరగాలని, గ్రామానికి సుఖశాంతులు, సమృద్ధి కలగాలని హనుమాన్ స్వామిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించారు.