calender_icon.png 29 December, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సర్పంచ్‌లతో ఆత్మీయ సమావేశం

29-12-2025 12:37:48 AM

ఆకట్టుకున్న మిట్టపల్లి సురేందర్, పాటమ్మా రాంబాబు మాట, ముచ్చట

కామారెడ్డి, డిసెంబర్ 28,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని మండలాల గ్రామాల నుంచి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులతో ఆదివారం జనగామ గ్రామంలో తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి సుభాష్ రెడ్డి అధ్యక్షత వహించగా, ప్రముఖ గాయకులు మిట్టపల్లి సురేందర్, పాటమ్మా రాంబాబు లతో నిర్వహించిన ‘మాటముచ్చట’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వారి సంభాషణలు, అనుభవాలు, ప్రజాజీవితంపై చేసిన వ్యాఖ్యలు సమావేశానికి హాజరైన వారిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, స్థానిక సంస్థల బలోపేతంపై విస్తృతంగా చర్చ జరిగింది. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా సమన్వయంతో పని చేయాలని సుభాష్ రెడ్డి  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి గారి శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.