11-08-2025 12:00:00 AM
-ముంచెత్తున్న వరద, డ్రైనేజీ నీరు
- కుంగిపోతున్న నాలాలు, మ్యాన్‌హోల్స్
- ఆయా డివిజన్ కాలనీల్లో పూర్తికాని డ్రైనేజీ పనులు
- భయాందోళనలో ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలు
ఎల్బీనగర్, ఆగస్టు 10 : వానొస్తే ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా లో తట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీళ్లు చేరుతున్నాయి. పలు ప్రాంతాల్లోకి భారీగా నీళ్లు వస్తుండడంతో నాలాలు, డ్రైనేజీ పైప్ లైన్ పగిలిపోతున్నాయి. ఫలితంగా ఇండ్లలోకి నీరు చేరుతుంది.
రహదా రుల ధ్వంసం అవుతున్నాయి. రోడ్లపై మురు గు, చెత్తాచెదారం, బురద చేరడంతో వీధుల న్నీ కంపుకొడుతున్నాయి. పలుచోట్ల తాగునీరు కలుషితం అవుతున్నాయి. ఇటీవల కు రిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముంపు నివారణకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు, సిబ్బంది తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న పదకొండు డివిజన్లలో ఆయా కాలనీలు ముంపు ప్రాంతాలుగా ఉన్నాయి. ముఖ్యం గా గడ్డి అన్నారం, చైతన్యపురి, కొత్తపేట, నాగోల్ డివిజన్లలో వరద మూసీ నదిలో చే రుతుంది.
ఆయా కాలనీల్లో భారీగా వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతా యి. లింగోజిగూడ డివిజన్ లోని పలు ప్రాం తాల్లోకి ఎగువన ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే వరద ముందుగా సరూర్ నగర్ చెరువులోకి చేరి, అక్కడి నుంచి మూసీలోకి వర ద వెళ్తుంది. అయితే, ఎగువన ఉన్న ప్రాం తాల నుంచి వచ్చే వరద లింగోజిగూడ, హ స్తినాపురం, చంపాపేట డివిజన్ లోని పలు కాలనీలను ముంచెత్తుంది. దీంతో పాటు దిల్ సుఖ్ నగర్ నుంచి హయత్ నగర్ వ రకు, సాగర్ రింగ్ రోడ్డు నుంచి చంపాపేట వరకు, సాగర్ రింగ్ రోడ్డు నుంచి బీఎన్ రెడ్డి నగర్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీల ప్రజలు సైతం తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు.
ఆయా ప్రాంతా ల్లో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులతో నాలాలు దెబ్బతినడంతోపాటు పలుచోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గ తంలో అప్పటి అవసరాలకు అనుగుణంగా వేసిన డ్రైనేజీ పైప్ లైన్, ట్రంక్ లైన్ పెరిగిన జనాభాకు సరిపోకపోడంతో నిత్యం పారిశు ద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి తో డుగా భారీ వర్షం పడితే లోతట్టు ప్రాంతాల నుంచి వరద వెళ్లే అవకాశం లేకపోవడంతో కాలనీలను వాన నీరు ముంచెత్తుతోంది.
- పూర్తి కాని ట్రంక్ లైన్, బాక్స్ డ్రైన్ పనులు
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముంపు నివారణకు ఆయా డివిజన్లలో ట్రంక్ లైన్ ప నులు, బాక్స్ డ్రైన్ నాలాలను నిర్మించారు. పలుచోట్ల పనులు ఇంకా పూర్తి కాలేదు. బీఎ న్ రెడ్డి, లింగోజిగూడ, హస్తినాపురం, వనస్థలిపురం, మన్సూరాబాద్, నాగోల్ డివిజన్ల లో ఇంకా బాక్స్ డ్రైన్ నాలా నిర్మాణ పను లు కొనసాగుతున్నాయి. బాక్స్ డ్రైన్ నిర్మాణాలు కేవలం వరద వెళ్లడానికి నిర్మిస్తున్నా రు. ట్రంక్ లైన్ పనులను డ్రైనేజీతోపాటు వాన నీరు వెళ్లడానికి నిర్మిస్తున్నారు. ఆయా కాలనీల్లో ట్రంక్ లైన్, బాక్స్ డ్రైన్ నిర్మాణా లు పూర్తి చేసి, ముంపు సమస్యను పరిష్కరించాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.
- నాలాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి
హయత్ నగర్ డివిజన్ లో వరద నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా బాక్స్ డ్రైన్ నిర్మాణాలు అనేక చోట్ల పూర్తి చేశాం. గతంలో బంజారా కాలనీ, బ్యాంకు కాలనీ, రంగనాయకులగుట్ట కాలనీలు నెల రోజులు నీట మునిగాయి.
అనేక చోట్ల ఓపెన్ నాలాలు, బాక్స్ డ్రైన్ నిర్మాణాలు పూర్తి చేయడంతో ముంపు సమస్యను నివారించాం. ట్రంక్ లైన్ పనులు సైతం త్వరలో పూర్తి చేస్తాం. శనివారం రాత్రి కురిసిన వర్షానికి పలుచోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వెంటనే స్పందించిన జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది ముమ్మరంగా పనులు చేస్తున్నారు.
కళ్లెం నవజీవన్ రెడ్డి, హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్