11-08-2025 12:00:00 AM
చేవెళ్ల, ఆగస్టు 10:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం మొయినాబాద్ కు రానున్నారు. మున్సిపాలిటీలో పరిధిలోని ముర్తూజ గూడలో సమీపంలో కొత్తగా ఏ ర్పాటు చేయనున్న సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య ఏర్పాట్లును పరిశీలించారు. డిప్యూటీ సీఎం మధ్నాహ్నం 3 గంటలకు రానున్నారని, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట టీపీసీసీ మెంబర్ షాబాద్ దర్శన్, నాయకులుఉన్నారు.