11-02-2026 02:58:42 AM
నారాయణపేట, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు ప్రేరణలో తమకు ఏమాత్రం ఉన్నా ఎంతటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉన్నామని మం త్రి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అందరూ అభ్యర్థుల మాదిరిగానే మహదేవప్ప బీజేపీ తరఫున తరపున పోటీ చేశారు.
ఎవరి ప్రచారం వాళ్లు చేసుకుంటాం.. ఎన్నికలు జరగడానికి ముందు అతను ఆత్మహత్య చేసుకోవడం అందరికీ బాధాకరమే. ఏ కారణం చేత అతను ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసుకోకుండా ఎంపీ డీకే అరుణ, బీజేపీ నాయకులు మాపై ఆరోపణలు చేయ టం వారి విచక్షణకే వదిలేస్తున్నాం. నేను దేవుడిని నమ్ముతాను. అతడు పోటీ చేసింది మొదలు ఇప్పటి వరకు నేను ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడినా, అతడిని బెదిరించినట్టు తేలినా ఎంతటి శిక్షకైనా నేను సిద్ధం’ అని శ్రీహరి అన్నారు.
ఒత్తిడికి గురయ్యాడా, భయపడ్డాడా, ఎవరైనా బెదిరింపులకు గురి చేశారా, ఖర్చులకు రావలసిన డబ్బులు అందక ఆత్మహత్య చేసుకున్నాడా అనే విష యం పోలీసుల విచారణలో తేలుతుంది అని వెల్లడించారు. అవసరమైతే రాష్ట్ర.. కేంద్ర ప్రభుత్వ సంస్థలచే విచారణ జరిపించినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నాలు చేయాలి కానీ, రాజకీయాలు చేయొద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీహరి వెల్లడించారు.