6 April, 2026 | 4:50 PM

Breaking News

కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •   ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా   •   హిందూ సమ్మేళనానికి రూ 5100 విరాళం   •  

సీఎంకు మానవత్వం లేదా?

11-02-2026 02:56 AM
  1. రిటైర్డ్ ఉద్యోగుల బెన్‌ఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేస్తారా?
  2. బకాయిలన్నీ వెంటనే చెల్లించాలి
  3. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ

కరీంనగర్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ‘సీఎం గారు.. మీకు మానవత్వం ఉందా. రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేయడం న్యాయమా’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. రిటైర్ అయ్యి రెండెళ్లయినా బెన్‌ఫిట్స్ బకాయిలను చెల్లించకపోవం దుర్మార్గమని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తనువు చాలించారన్నారు. ఉద్యోగుల చావులకు మీ బాధ్యత లేదా? ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ప్రాధాన్యత లేని కేటగిరీగా భావిస్తున్నారా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ తీరు తెలంగాణకు మాయని మచ్చ అని తెలిపారు. జీవిత మలి సంధ్యలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురిచేస్తుండటం క్షమించరానిదన్నారు. తక్షణమే అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని వారి బకాయిలన్నీ చెల్లించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేసేందుకు వెనుకాడబోనని బండి సంజయ్ కుమార్ తెలిపారు.