calender_icon.png 21 August, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్వాడీలు తెలంగాణలో కొత్త షాప్ పెడితే పగలగొడతాం

21-08-2025 12:00:00 AM

-తెలంగాణ బచావో మూమెంట్ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి

ముషీరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి):  తెలంగాణ రాష్ట్రంలో మార్వాడిలు కొత్త షాపు పెడితే పగలగొడతామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్,  తెలంగాణ బచావో మూమెంట్ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈ మేరకు బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బచావో మూమెంట్ లో మార్వాడి గో బ్యాక్ ఉద్యమ సంఘం ఆవిర్భావ సదస్సు ను నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ పిడమర్తి రవి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారత దేశ వ్యాపారులు ఎవరైనా సరే కొత్త షాపు పెడితే పగలకొడుతామని ఇకముందు ఉద్యమం మూడు రూపాలలో ఉంటుందని, మొదటి దశలో కొత్త షాపులు పెట్టనివ్వం, రెండవ దశలో కల్తీ వస్తువులను పట్టుకొని శిక్షిస్తాం,  మూడో దశలో ఉత్తర వ్యాపారస్తులు తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి అనే నినాదంతో తెలంగాణ బచావో మూమెంట్ పనిచేస్తుందని అన్నా రు.

ఈ కార్యక్రమంలో మాస్టర్ జి, విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాండురంగ చారి, నరసింహచార్యులు,నాయిని బ్రహ్మ సంఘం నాయకులు నాగేష్, రియల్ ఎస్టేట్ రాష్ట్ర అధ్యక్షులు నారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్, విశ్వంభర చీఫ్ ఎడిటర్ దయాకర్, రాపోలు రాములు, ఓయూ జెఏసి డాక్టర్ ముత్యం గౌడ్, కేయూ జేఏసీ డాక్టర్ బుల్లికొండ వీరేందర్, పైసా ఉపేందర్, మహమ్మద్ రహీం నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు మిట్ట యాదయ్య, శ్రీనాథ్ రావు వడ్డే, బిఎస్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, గజ్జల మల్లికార్జున్, జెస్సి, మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు నక్క మహేష్, దేవరకొండ నరేష్, చెవు గణేష్, కల్వకుర్తి శ్రీశైలం,నక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు.