8 July, 2026 | 8:21 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

అవకాశం ఉంటే డీసీసీ ఇవ్వండి

13-06-2025 01:02 AM
  1. లేదంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తా..

కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి 

నల్లగొండ టౌన్, జూన్ 12: అవకాశం ఉంటే డిసిసి ఇవ్వండి, లేదంటే పార్టీలో సామాన్య కా ర్యకర్తగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తూ  నల్లగొండ జడ్పిటిసి గా ఉమ్మడి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశానని తెలి పారు.

నాకు అధిష్టానం కేటాయించిన రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి న్యాయం చేయలేనని, నేనుండేది నల్లగొండలో రాష్ట్రస్థాయిలో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని ఆ పదవి వారికి కేటాయించాలని సూచించారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు.నా అ భిప్రాయంను మా నాయకత్వానికి తెలియజేశానని తెలిపారు. కావాలని కొంతమంది రాజకీయంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు .

మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా అభివృద్ధిలో పూర్తిస్థాయిలో ముందడుగు వేస్తుందన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకు మంత్రి అవకాశం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. నల్లగొండ పట్టణంలో సీసీరోడ్లు, డ్రైనేజీ పనులు 600 కోట్లతో పూర్తిస్థా యిలో పనులు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్ , మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, తదితరు లు నాయకులు పాల్గొన్నారు.