24 July, 2026 | 3:04 AM

విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వ పతనం తప్పదు

24-07-2026 12:17 AM

ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ 

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 23, (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ విమర్శించారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ, ప్రభుత్వ విద్యను బలహీనపరిచే విధానాలను కొనసాగిస్తే విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, ‘విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వ పతనం తప్పదు‘ అని హెచ్చరించారు.

విద్యారంగ సమస్యల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ను ముట్టడించారు. ఒకానొక దశలు కలెక్టరేట్ ముఖద్వారా గేటును తోసుకుంటూ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏఐఎస్‌ఎఫ్ జండాలు పట్టుకొని పలువురు విద్యార్థులు గేట్లు ఎక్కి నినాదాలు చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏవో కృష్ణ ప్రసాద్ కు అందజేశారు.  ఈ కార్యక్రమంలోఏఐఎస్‌ఎఫ్  జిల్లా సహాయ కార్యదర్శిలు ఇనపల్లి పవన్ సాయి గుండల సుజన్ మాణిక్యాల వినయ్ గుగులోత్ వంశీ జిల్లా ఉపాధ్యక్షులు అక్కినపల్లి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.