నా చావుకు ప్రధానే కారణం
- సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య
- సిరిసిల్ల జిల్లా గొల్లపల్లిలో ఘటన
సిరిసిల్ల, జూలై 23 (విజయక్రాంతి): నా చావుకు ప్రధాని నరేంద్ర మోదీనే కారణని సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పిట్ల వంశీ (25) బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి పిట్ల భారతి, తండ్రి బాలయ్య వున్నారు. వంశీ పదో తరగతి వరకు చదివాడు.
ఆత్మహత్యకు ముందు ‘సర్’ ఫామ్‌లో తన చావుకు ప్రధాని నరేంద్ర మోదీ కారణమని సూసైడ్ నోట్ రాశాడు. అయితే వంశీ పెయిం టర్‌గా పని చేసేవాడని, ఎవరితో తగాదాలు, గొడవలకు వెళ్లడని, రాజకీయ పరిజ్ఞానం కూడా అంతగా లేదని తన సన్నిహితులు చెపుతున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.






