మధిరలో ముమ్మర తనిఖీలు
మధిర, జూలై 23, (విజయక్రాంతి): మధిర పట్టణంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వైరా ఏసిపి సారంగపాణి నేతృత్వంలో మధిర టౌన్ సీఐ డి.రమేష్, ఎస్‌ఐలు కిషోర్ కుమార్, నవిత, మధిర టౌన్ పోలీసులు గురువారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ డి.రమేష్ మాట్లాడుతూ... మధిర పరిధిలో గంజాయి, డ్రగ్స్ లేదా ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేసినా, అమ్మకాలు జరిపినా, రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండ్, స్థానిక హోటళ్ళు, పాఠశాలల, కళాశాలల ఆవరణలో ఉన్నటువంటి పాన్ షాప్ లో చాయ్ కొట్లు, కొరియర్ సర్వీస్ స్టాక్ పాయింట్స్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, తదితర ప్రాంతాలలో ప్రత్యేక డాగ్ స్క్వాడ్తో జల్లెడ పట్టారు.గంజాయి మత్తు పదార్థాల రవాణా, విక్రయం,వినియోగ సమాచారం తెలిసినచో వెంటనే 8712659160,1908 ల ఫోన్ నెంబర్లకి ఫోన్ తెలపాలన్నారు.






