16-06-2025 12:17:29 AM
- పాలమూరు జిల్లాలో కల్తీ స్వీట్స్ దందా
- ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమ
మహబూబ్ నగర్ జూన్ 15 (విజయ క్రాంతి) : గుట్టుచప్పుడు కాకుండా జిల్లా కేంద్రంలోని కోయిల్ కొండ ఎక్స్ రోడ్ దగ్గర ఒక ప్రత్యేకమైన షెడ్డు వేసి నాణ్యత లేకుండా తిను బండారాలను తయారు చే స్తూ కొందరు దర్జాగా వ్యాపారం చేసుకుంటు న్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఆదివారం ఆ గోదాంలోని తినుబండారాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ జిల్లా ఫుడ్‌ఇన్స్పెక్టర్ వి నీలిమ, శ్రీలత, కరుణాకర్ లు మాట్లాడు తూ తినుబండారులను తయారు చేసేందుకు అనుమతి కూడా లేదని, వివిధ వస్తువులను పూర్తిస్థాయిలో పరిశీలించినందుకు ల్యాబ్ పంపించడం జరిగింది అని తెలిపారు. రసగుల్లా, బర్ఫీ, పల్లి చెక్క, బాద్షా ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యమైన తినుబండాలను తయా రుచేసి ప్రజలకు అందించాలని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తదితరులుఉన్నారు.