18 April, 2026 | 4:13 AM

స్పందించకుంటే సమ్మెకు దిగుతాం

08-12-2024 06:04 PM

సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షడు మోహన్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు దిగుతామని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మోహన్ స్పష్టం చేశారు. మరి సమస్యలపై గత మూడు రోజులుగా చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాలుగా తమను సుమదోపిడికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం చొరవ తీసుకోకుంటే ఈ నెల 10వ తేదీ నుండి విద్యాశాఖలోని సమగ్ర శిక్షణ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శృతిక, ప్రధాన కార్యదర్శి తుకారం, కోశాధికారి నాగేష్, మీడియా ప్రతినిధి సంతోష్, ఉద్యోగులు పాల్గొన్నారు.