18 April, 2026 | 6:03 AM

అభివృద్ధి విషయంలో రాజిపడేది లేదు

08-12-2024 06:11 PM

కోటి 31 లక్ష 97 వేలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు...

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి అభివృద్ధి విషయంలో రాజిపడేది లేదని, ప్రజాపాలనలో పెద్దపల్లి పట్టణ సుందరీకరణకు మోక్షం లభిస్తుందని, శరవేగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని, పట్టణ ప్రజలందరికీ మంచినీటి సమస్య లేకుండా చేస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో పెద్దపల్లి మున్సిపాలిటీకి అదనంగా మరో రూ. 15 కోట్లు మంజూరు అయ్యాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ఆదివారం ఆయన పెద్దపల్లి పట్టణంలోని 26, 27, 28 వార్డులల్లో ప్యాకేజి-9 ద్వారా (టీయూఎఫ్ ఐడిసీ) నిధులు 1 కోటి 31 లక్షల 97 వేల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్ట్ ల నిర్మాణాలకు స్థానిక కౌన్సిలర్లతో, నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ముందుగా పలు వార్డుల ప్రజలు, నాయకులు గజమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పలు వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.