విద్యార్థులు దృఢంగా ఉండాలంటే కరాటే నేర్పించాలి
మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్...
లక్షేట్టిపేట్ (విజయక్రాంతి): విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి అంటే కుంగ్ ఫూ కరాటే నేర్పించాలి అని మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ లోని గురునానక్ ఫంక్షన్ హాల్ లో డ్రాగన్ స్వార్డ్ కుంగ్ ఫూ ఫోర్త్ మీట్ కుంగ్ ఫూ స్టేట్ లెవెల్ కరాటే ఛాంపియన్ షిప్ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్ చంద్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ ఆర్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పేదవాడికి అందుబాటులో ఉన్న ఆర్ట్ అంటే కుంగ్ ఫూ కరాటే అని ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు కుంగ్ ఫూ నేర్పించాలని అన్నారు. ముఖ్యంగా నేటి యుగంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల నుండి తమను తామూ కపడుకోవడానికి కుంగ్ ఫూ ఆర్ట్ చాలా ఉపయోగాపడుతుంది అని అన్నారు.
పిలలకు భోజన సహాయం చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ధన్యవాదములు తెలిపారు. పోటీలలో సుమారు 700 మాంది విద్యార్థులు 100 కుంగ్ ఫూ మాస్టర్లు పాల్గొన్నారని తెలిపారు. జిల్లా నలు మూలాల నుండి విద్యార్థులు రావడం చాలా ఆనందంగా ఉంది ఆని ప్రభుత్వము కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు కూడా కుంగ్ ఫూ పై అవగాహన కల్పిస్తూ ఈ విద్యను ప్రతి విద్యార్థికి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్ దండేపల్లి మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, దండేపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ సురేష్ నాయక్, రంజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.






