13 August, 2026 | 2:47 AM

ఎమ్మెల్యే మల్‌రెడ్డిపై విమర్శలు చేస్తే ఖబడ్దార్..!

13-08-2026 12:16 AM

రాగన్నగూడ రోడ్డు ఎలా పాడయిందో నీకు తెలియదా?

కాంగ్రెస్ సీనియర్ నాయకులు సామ భీంరెడ్డి 

ఆదిబట్ల, ఆగస్టు 12 (విజయక్రాంతి): రాగన్నగూడ పాత రోడ్డు సమస్యపై కాంగ్రెస్ నాయకుడు సామ భీమ్రెడ్డి మాజీ కౌన్సిలర్ రొక్కం అనిత చంద్రశేఖర్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాగన్నగూడ మెయిన్రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే రహదారి కోసం మంజూరైన రూ.75 లక్షలు 20వ వార్డుకు ఎలా తరలిపోయాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. నిధులు మళ్లించారని ఆరోపిస్తే అందుకు సంబంధించిన ఆధారాలను చూపాలని కోరారు.

నాగార్జున కాలనీలో సామ సంజీవరెడ్డి ఇంటి ముందు మంజూరైన రోడ్డు పనులను బీబీఆర్ వెంచర్ సమీపంలో వేయించలేదా? అని ప్రశ్నించారు. నాగార్జున కాలనీ 7వ వార్డులో భాగం కాదా? గతంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాగన్నగూడలో నాలుగైదు కాలనీల ప్రజలు, పాఠశాల బస్సుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వ స్థలంలోని పాత గ్రామపంచాయతీ కాంపౌండ్వాల్ను అధికారులు వెనక్కి జరిపారని తెలిపారు.

ప్రైవేట్ ఇళ్లు, వ్యక్తిగత స్థలాలకు ఎలాంటి నష్టం కలగలేదని స్పష్టం చేశారు.రాగన్నగూడ రోడ్డు దెబ్బతినడానికి గతంలో భారీ లారీల ద్వారా మట్టి తరలించడమే ప్రధాన కారణమని భీమ్రెడ్డి ఆరోపించారు. మీ పొలానికి వేల లారీల మట్టి తరలించలేదా? దాంతో రోడ్డు దెబ్బతినలేదా? అని ప్రశ్నించారు.

గత విషయాలను మరిచి ప్రస్తుతం రోడ్డు దుస్థితిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే ఖబర్దార్ స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని విమర్శించే స్థాయి మాజీ కౌన్సిలర్కు లేదని సామ భీమ్రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. మా ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే ఖబర్దార్.. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు. మావేశంలో మాజీ సర్పంచ్ పూజా శంకరయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు బాలశివుడు గౌడ్, రొక్కం ప్రభాకర్రెడ్డి, రామావత్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.