‘పొన్నం’ దమ్ముంటే ఎంపీగా పోటీ చేయ్
l కరీంనగర్‌లో బీజేపీ నేతల సవాల్
కరీంనగర్, ఏప్రిల్19 (విజయ క్రాంతి): పొన్నం ప్రభాకర్‌కు దమ్ముంటే తన మంత్రి పదవికి పోటీచేసి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలని బీజేపీ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సవాల్ విసిరారు. శుక్రవారం వారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తరఫున కరీంనగర్ కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. కొద్దిరోజు లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ అభ్య ర్థి బండి సంజయ్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నారని, మంత్రిగా ఉండీ దిగజారిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డా రు.
లిక్కర్ స్కాం నిందితుడు శరత్ చంద్రారెడ్డి బీజేపీకి రూ.500 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇవ్వగానే ఆయనకు బెయిల్ వచ్చిందని మంత్రి పొన్నం అనడం అవివేకమ న్నారు. శరత్‌చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు అని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు సుప్రీం కోర్టుపై చేసినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు పొన్నం వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేయాలని అభ్యర్థిస్తున్నామన్నా రు. వారి వెంట కరీంనగర్ మాజీ మేయర్ శంకర్, కార్పొరేటర్ రమణారెడ్డి ఉన్నారు.






