23 May, 2026 | 12:28 AM

నాపై తప్పుడు ప్రచారం

20-04-2024 12:15 AM

l బీజేపీ గెలుస్తుందని తానెక్కడ చెప్పలేదు 

l కాంగ్రెస్ అంటే వీహెచ్.. వీహెచ్ అంటే కాంగ్రెస్ 

l పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు 

హైదరాబాద్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే విధంగా తాను ఎప్పుడూ వ్యవహారించలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుం దని, కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు లేవని మీడియాలో వచ్చిన వార్తలతో తనకు సం బంధం లేదన్నారు. ఆ వార్తల వెనక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర దాగుందని వీహెచ్ మండిపడ్డారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తాను మాట్లాడని అంశాలను తప్పుగా ప్రచురితం చేసిన వారిపై సైబర్ క్రైమ్ కింద పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినట్లు తెలిపారు. వీహెచ్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వీహెచ్ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఓటమి బాధలో ఉన్న కేసీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు.