17-07-2025 12:10:58 AM
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘నదివే..’ పాటను మేకర్స్ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు.
‘నదివే నువ్వు నదివే.. నీ మార్పే రానుంది వినవే.. నదివే నువ్వు నదివే.. నీకే నువ్వియాలి విలువే.. సిలువ బరువే మోయక సులువు భవితే లేదుగా.. వెన్నెల వలదను కలువే నువ్వుగా.. నదివే నువ్వు నదివే..’ అంటూ ప్రేయసి ప్రత్యేకతను పొగుడుతూ కవితాత్మకంగా సాగుతోందీ గీతం. హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు సమకూర్చడమే కాక ఆయనే ఈ పాటను ఆలపించారు. రాకేందు మౌళి సాహిత్యం అందించారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.