1 July, 2026 | 6:55 PM

Breaking News

అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •  

అవినీతిని ప్రశ్నిస్తే నిందలా?

29-06-2024 12:05 AM
  • బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకే అభివృద్ధి నిధులు
  • మున్సిపల్ చైర్‌పర్సన్‌పై కాంగ్రెస్ కౌన్సిలర్ల ఆగ్రహం

సూర్యాపేట, జూన్28 (విజయక్రాంతి): మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించినందుకు తమ వార్డుల అభివృద్ధికి నిధులను ఇవ్వకపోవడమే కాక తమపై నిందలు వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెడ్ హౌస్‌లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్లతో కలిసి మీడియాతో మాట్లా డారు. గురువారం చైర్‌పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో తమపై కక్ష పూరితంగా చైర్ పర్సన్ అన్నపూర్ణ, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు అసత్య ఆరోపణలు చేశారని మం డిపడ్డారు.

గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను కాంగ్రెస్ కౌన్సిలర్లు మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. పట్టణ ప్రగతి పేరుతో కేవలం బీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు రూ.5 లక్షలు కేటాయించారని ఆరో పించారు.  అవినీతిని ప్రశ్నించిన 31 మంది కౌన్సిలర్లకు నిధులను కేటాయించలేదని దు య్యబట్టారు. హరితహరం పేరుతో రూ.3 కో ట్లు ఖర్చు చేసి నాటిన లక్ష మొక్కలు ఏమయ్యాయని వివరణ అడిగితే మేకలు తిన్నా యని సమాధానం ఇచ్చారని ధ్వజమెత్తారు. మున్సిపల్ వాహనాల  పంక్చర్లు, టైర్లు, ట్యూ బ్‌లకు రూ.40 లక్షలు ఖర్చు చేశామని అజెండాలో పేర్కొన్నారని తెలిపారు.

రూ.30 కోట్ల తో ఇంటిగ్రేటేడ్ మార్కెట్  నిర్మించి అప్పటి సీఎం కేసీఆర్‌తో ప్రారంభిస్తే పట్టుపని పదిరోజులు కూడా వ్యాపారాలు నడువలేదని అన్నారు. డంపింగ్ యార్డ్ కోసం  రూ.90 లక్షలతో తెచ్చిన మిషన్ మెయింటెన్స్‌కు రూ.35 లక్షలు ఖర్చు చేశారని విమర్శించారు. సమావేశంలో కౌన్సిలర్లు బైరు శైలేందర్, బచ్చలకూరి శ్రీనివాస్, యాదగిరి, రాజేందర్, శబరి, చంద్రునాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.