నూతన చట్టాలపై అవగాహన ఉండాలి
29-06-2024 12:05 AM
- అడిషనల్ ఎస్పీ నర్సింహరెడ్డి
కామారెడ్డి, జూన్ 28 (విజయక్రాంతి) : నూతన చట్టాలపై ప్రతి పోలీసుకు అవగాహన ఉండాలని కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కామారెడ్డి ఎస్పీ ఆదేశాల మేరకు నూతన చట్టాలపై పోలీసు అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 1 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు అవుతాయని, అందుకు అనుగుణంగా కొత్త చట్టాలను అనుసరించాలని సూచించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక సురక్ష సంహిత (బిఎన్‌ఎస్), భారతీయ సాక్ష్యా అధినియం 2023పై పూర్తి అవగాహన ఉన్నప్పుడే సమర్థంగా విధులు నిర్వహించగలమని చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మదన్‌లాల్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.




