04-07-2025 12:32:57 AM
- ముర్రేడు వాగు అవతలి ఒడ్డుకు వైకుంఠధామం
- కిష్టారం గ్రామస్తుల అవస్థలు
- టేకులపల్లి, జులై 3 (విజయక్రాంతి):కర్మకాలి కాలం చేస్తే, దహన సంస్కారాలు చే యాలంటే ఉన్న వారికి చావుకొస్తుంది. ఇది టేకులపల్లి మండలం కిష్టారం గిరిజన గ్రామస్తుల అవస్థలు. గ్రామం ముర్రేడు వాగుకు ఇవతలి వడ్డున ఉంది. వైకుంఠధామం అవతలి వడ్డున ఉండటంతో వర్షాకాలం వస్తే చె ప్పనలిమి కానీ ఇబ్బందులు పడాల్సి వస్తోం ది. వ
ర్షం కురిసి వాగు పొంగి ప్రవహించే రోజుల్లో గ్రామంలో ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాలు చేయాలంటే వాగుదా టి వెళ్లాల్సిన పరిస్థితి. మృతదేహాన్ని ఉంచలేక వాగొచ్చిన, వరదొచ్చినా అష్టకష్టాలు ప డి వాగు దాటి దహన సంస్కారాలు చేస్తున్నామని గ్రామస్తులు చింత జోగయ్య (దొర), జబ్బ జోగయ్య (పటేల్), మాజీ ఎం పీపీ పాయం లక్ష్మీనర్సు వాపోతున్నారు.
రెం డు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగు పొంగి ప్రవహించడంతో గ్రామంలో ఒకరు మృతి చెందితే దహన సంస్కారాలు చేసేందుకు దయనియ పరిస్థితిలో వాగు దాటటా నికి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు ఉపయోగించి శవాన్ని వేశారు. నాయకులు, ఉన్నతాధికారులు తమమొర ఆలకించి వాగుపై వంతెనను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.