calender_icon.png 16 August, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కు అస్వస్థత

16-08-2025 01:30:54 PM

మాజీ ఎమ్మెల్యే కంచర్ల పరామర్శ

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లగొండ మార్కెట్ కమిటీ(Nalgonda Market Committee) మాజీ చైర్మన్ బొర్ర సుధాకర్  తీవ్ర అస్వస్థతకు గురై  హైదరాబాద్ మలక్ పేట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి వారిని శనివారం పరామర్శించారు. ఆసుపత్రి వైద్యులను వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్య చికిత్స  అందించవలసిందిగా కోరారు. వారు త్వరగా కోలుకుంటారని, పూర్తి ఆరోగ్యంగా బయటికి వస్తారని ధైర్యంగా ఉండవలసిందిగా కుటుంబ సభ్యులను కోరారు .