calender_icon.png 16 August, 2025 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షంతో పొంగిపొర్లుతున్న కామారెడ్డి పెద్ద చెరువు

16-08-2025 01:33:39 PM

జిల్లాలో పొంగిపొర్లుతున్న ప్రాజెక్టులు, చెరువులు కుంటలు 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. కామారెడ్డి పెద్ద చెరువు(Kamareddy Pedda Cheruvu) భారీ వర్షానికి పొంగిపొర్లుతుంది. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. కళ్యాణి ప్రాజెక్టు రెండు గేట్లు నీటిపారుదల శాఖ అధికారులు ఎత్తివేశారు. పోచారం ప్రాజెక్టు లోకి ఇన్ఫ్లో పెరిగి నిండుకుండల మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 19,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుంది. మొత్తం 1,045 అడుగులు పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను, ప్రస్తుతం 1396. 25 అడుగులకు నీరు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7,804 టీఎంసీలు నీరు నిలువ ఉంది. ఇన్ఫ్లో కొనసాగడం లేదు. పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి 21 అడుగులు కాగా నీటిమట్టం పూర్తిస్థాయిలో చేరుకొని అలుగు దూకుతుంది.

పోచారం ప్రాజెక్టులోకి ప్రస్తుతం 3000 క్యూసెక్కుల భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు అలుగుపరులుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అధికంగా పంటలు బాగా పడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా కోరుతున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు, వాగులు ప్రవహిస్తుండడంతో పోచారం ప్రాజెక్టు లోకి భారీ నీరు చేరి అలుగు పారుతున్నది. పోచారం నుంచి అలుగు పారుతున్న  నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తున్నట్లు నీటిపారుల శాఖ అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న మంజీరా నది గుండా సింగర్ డ్యాం నుంచి 40,000 క్యూసెక్కుల భారీ వరద నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో కళ్యాణి ప్రాజెక్టులో 600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరిందని నీటి పాదాల శాఖ ఈ ఈ సోలేమాన్ తెలిపారు.

కళ్యాణి ప్రాజెక్ట్ 409.50 m నీటిమట్టం కాగా ప్రస్తుతం 408.50  మీటర్ల  నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్ట్ ఎగువ నుంచి వస్తున్న నీటితో ప్రాజెక్టు నిoడంతో ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేసి 300 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న మంజీరా లోకి వదులుతున్నట్లు తెలిపారు. 250 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వర్షాభావంతో వాగులు వంకలు కూడా వరదనీడితో ప్రవహిస్తున్నందున ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ ఈ ఈ సులేమాన్ తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పారుతుంది. ఈ నీరు కామారెడ్డి వాగు నుంచి పల్వాంచవాగు గుండా మిడ్ మానేరు డ్యామ్ లోకి నీరు వెళ్తాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని లింగంపేట్, గాంధారి, భీమేశ్వర వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘూవన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు సూచిస్తున్నారు.