16-08-2025 01:28:53 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ తాండ కు చెందిన కేతావత్ హరి సింగ్ కుటుంబానికి శనివారం బాన్సువాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్(Jana Sena Party Incharge) రవీందర్ చౌహన్ జనసేన పార్టీ పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఇన్స్యూరెన్స్ ఐదు లక్షల రూపాయలు చెక్కులు అతని భార్య రుక్కీ భాయ్ కు అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ చౌహన్ మాట్లాడుతూ ఇటీవల కేతవత్ హరి సింగ్ చనిపోవడంతో, ఆయన కుటుంబానికి జనసేన పార్టీ క్రియాశీలిక సభ్యత్వం నుంచి ఈ ఐదు లక్షల నగదు అందజేశారు.
ఈ సందర్భంగా. జనసేన నేత పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకం తో మారుమూల గ్రామం చిన్నరాంపూర్ తండాలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వలన ఆ కుటుంబానికి ఆర్థిక బలం చేకూరడం తో మూడ్ రవీందర్ చౌహాన్ సభ్యత్వం చేయించినందుకు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు. ఇన్సూరెన్స్ డబ్బులు మంజూరు చేసేందుకు కృషి చేసిన రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జి నెమూరి శంకర్ గౌడ్ , వీర మహిళ విభాగం అధ్యక్షురాలు మండపేట కావ్య , ధనుష్ కి కృతజ్ఞతలు తెలిపారు.బాన్స్వాడ నియోజకవర్గంలో ఇప్పటికీ 39 మంది జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్నారని ఆయన తెలిపారు పార్టీ ద్వారా నియోజకవర్గంలో మూడు కుటుంబాలు లబ్ధి పొందాయని ఆయన అన్నారు.