calender_icon.png 16 August, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగిన ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు అదనంగా కొత్త బస్సులు ఏర్పాటు

16-08-2025 01:35:28 PM

  1. బాన్సువాడ డిపో లో రెండు కొత్త ఎక్ప్రెస్  బస్ సర్వీసులు
  2. ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు సర్వీస్ లను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడంతో మహిళలు విద్యార్థినీలు ప్రయాణాలు బాగా పెరగడంతో పెరిగిన ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు అదనంగా కొత్త బస్సు సర్వీస్ లను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా  బాన్సువాడ డిపోకు కెటాయించిన రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ  నిజామాబాద్ నుండి జహీరాబాద్,బాన్సువాడ నుండి నారాయణఖేడ్ సర్వీసు బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు బస్సు సర్వీస్ లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి డిపో మేనేజర్ సరితా దేవి,మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, బీర్కూర్ ఏఎంసీ చైర్మన్ శ్యామల, నాయకులు ఎజాజ్, అంజిరెడ్డి, నార్ల సురేష్, శశికాంత్, ప్రజాప్రతినిధులు, నాయకులు, RTC అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.