కష్టపడితే ఏ స్థాయికైనా ఎదగొచ్చు
మహిళల ఆర్థిక స్వావలంబనకు సీడీఏ చేయూత: మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్
కల్లూరు,ఆగస్టు 13 (విజయ క్రాంతి): పేద, ఒంటరి మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ, మిషన్లు, సర్టిఫికెట్లు అందిస్తున్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ (సిడిఏ) సేవలు అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ అన్నారు.కల్లూరులో నిర్వహించిన కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను కూడా టైలర్గా పనిచేసి కష్టపడి ఎదిగానని,ప్రతి ఒక్కరూ కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగాలని సూచించారు.
సిడిఏ కార్యదర్శి, ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ ఏనోష్ కుమార్ మాట్లాడుతూ..ఐదు నెలల ఉచిత శిక్షణతో పాటు మిషన్,సర్టిఫికెట్ అందిస్తున్నామని తెలిపారు.ఇప్పటివరకు ఆరు బ్యాచ్లలో సుమారు 240 మంది మహిళలకు శిక్షణ ఇచ్చామని చెప్పారు.త్వరలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చేతిపంపు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాటేపల్లి రజనీకాంత్,కాటేపల్లి కిరణ్,మట్టూరు జనార్ధన్,చారుగుండ్ల సందీప్, జాన్ పరంజ్యోతి,రాయల తిమోతి,తేలూరి సంజీవరావు, జీవన్ కుమార్,శాలెం దాసన్న, యెహోషువ,రాయల్ థామస్, కుట్టుమిషన్ శిక్షణ ఉపాధ్యాయురాలు మేరీ గోల్ పలువురు నాయకులు,సిడిఏ ప్రతినిధులు పాల్గొన్నారు.






