14 August, 2026 | 1:31 AM

పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

14-08-2026 12:00 AM

డాక్టర్ రాఘవేంద్ర కుమార్ ఎంబీబీఎస్, డీసీహెచ్, పీఏఎల్‌ఎస్  

మహబూబ్‌నగర్, ఆగస్టు 13 (విజయక్రాంతి): సిరి చిన్నపిల్లల ఆసుపత్రిలో డెం గ్యూ, చికున్‌గున్యా, వైరల్ జ్వరాల నుంచి పిల్లలను కాపాడేందుకు తల్లిదండ్రులకు వైద్యులు సూచనలు చేశారు. భారీవర్షాలు, నిల్వ నీరు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాకాలంలో పిల్లల్లో అం టువ్యాధులు వేగంగా వ్యాపించే ప్రమాదం అధికంగా ఉంటుందని సిరి చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ రాఘవేంద్ర కుమార్ తెలిపారు.

ఈ కాలంలో డెంగ్యూ, చికున్‌గున్యా, వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా విరేచనాలు, కామెర్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కంటి కలక వంటి వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.పిల్లలకు జ్వ రం, శరీర నొప్పులు, వాంతులు, విరేచనాలు, కళ్లు ఎర్రబడటం, దగ్గు, శ్వాస తీసుకో వడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. స్వయంగా మందులు వాడించడం ప్రమాదకరమని హె చ్చరించారు.

పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు.  ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.దోమలు కుట్టకుండా పూర్తి చేతుల దుస్తులు వేయించాలి. దోమతెరలు, మస్కి టో రిపెలెంట్లు ఉపయోగించాలి.మరిగించి చల్లార్చిన లేదా శుద్ధి చేసిన నీటినే తాగించాలి. తాజా, పరిశుభ్రమైన ఆహారం మాత్ర మే ఇవ్వాలి. బయట లభించే కలుషిత ఆహారానికి దూరంగా ఉంచాలి.పిల్లలకు తరచూ సబ్బుతో చేతులు కడిగే అలవాటు చేయాలి.

ప్రభుత్వ టీకా కార్యక్రమంలో సూచించిన అన్ని టీకాలను సమయానికి వేయించాలి. రెండు రోజులకుపైగా జ్వరం తగ్గకపోవడం పదేపదే వాంతులు లేదా తీవ్రమైన విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్ల లు నీరసంగా ఉండడం లేదా స్పృహ కోల్పోవడం, మూత్రం తగ్గిపోవడం,డెంగ్యూ అను మాన లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్ రాఘవేంద్ర కుమార్ మాట్లాడుతూ, ‘వర్షాకాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా పిల్లల ఆరో గ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పరిశుభ్రత పా టించడం, సమయానికి వైద్యులను సంప్రదించడం ద్వారా చాలా వ్యాధులను నివా రించవచ్చు’ అని తెలిపారు.