calender_icon.png 21 January, 2026 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా మద్యం విక్రయాలు

21-01-2026 12:32:17 AM

గ్రామాలలో విచ్చలవిడిగా బెల్టు షాపులు..

అనుమతులు లేకుండానే దర్జాగా దందా..

పట్టించుకోని అధికారులు..

తాడ్వాయి, జనవరి20 (విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీన  వైఖరి కారణంగా గ్రామాలలో విచ్చల విడిగా బెల్టు షాపుల నిర్వహణ కొనసాగుతుంది. గ్రామాలలో అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్న సదరు అధికారులు తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సదరు బెల్ట్ షాపుల  వ్యాపారులు అందించే మామూళ్లకు తలొగ్గుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అడిగేవారు ఎవరన్నా ధీమాతో సదరు వ్యాపారులు దందాను కొనసాగిస్తున్నారు. దీంతో వారు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే అనుమతులు ఉన్నట్లు వ్యాపారులు మూడు పువ్వులు ముప్పయి ఆరు కాయలుగా దందాను సాగిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో అక్రమ బెల్టు షాపుల దందా ధర్జాగా కొనసాగుతుంది. అక్రమ బెల్టు షాపులను నియంత్రించాల్సిన సదరు ఎక్సైజ్ శాఖ అధికారులు వాళ్ళు ఇచ్చే ముడుపులకు తలోగ్గడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాలలో బెల్టు షాపు లు ధర్జాగా కొనసాగుతున్నాయి. బెల్ట్ షాపులలో వైన్స్‌షాపులను మరిపించే విధంగా మధ్యాన్ని విక్రయిస్తున్నారు.దీంతో యువకులు ఉదయం నుంచే మద్యం మత్తులో ఊగిపోతున్నారు. మద్యం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ మధ్యాన్ని నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటలు అయ్యిందంటే చాలు ఎక్కడబడితే అక్కడ గ్రామాల్లో సిటింగులు కొనసాగుతున్నాయి. అనుమతులు ఉన్న మద్యం దుకాణంలో విక్రయించే మద్యం ధరల కంటే బెల్టు షాపుల్లో అమ్మే మద్యం ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. బెల్ట్ షాపుల నిర్వాహకులు ఇష్టం వచ్చినంత ధరల కు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు.

ఎలాంటి ప్రభుత్వ మతులు లేకుండానే మద్యం విక్రయాలు..

ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాలలో రోడ్డు పక్కనే దర్జాగా బెల్టు షాపులు తెరిచి మధ్య విక్రయాలు సాగిస్తున్నారు. అయినా సదరు బాధ్యత గల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ధీంతో తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. నెలనెలా సదరు వ్యాపారుల నుంచి అందుతున్న మామూళ్ల కు అలవాటు పడ్డ అధికారులు ఏమి పట్టనట్లుగా వ్యవగారిస్తున్నారు. ధీంతో అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మండలంలో ఒకే ఒక్క వైన్స్ దుకాణం

తాడ్వాయి మండలంలో ఒకే ఒక్క వైన్స్ దుకాణం ఉంది. కానీ బెల్టు దుకాణాలు ఎక్కడబడితే అక్కడ దర్శనం ఇస్తున్నాయి. మండలంలోని బ్రాహ్మణపల్లి, కృష్ణాజివాడి, కన్ కల్, కరడ్ పల్లి, నందివాడ, ఎర్రపహడ్, చిట్యాల, సంతాయిపేట, చందాపూర్, సోమారం  గ్రామాల్లో అక్రమంగా బెల్టు షాపులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న బెల్టు షాపులను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో ఏళ్ల వేళల అందుబాటులో ఉండడంతో యువకులు మద్యానికి బానిసలవుతున్నారని వాపోతున్నారు. సదరు అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించడంతో కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

సదరు ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్య కారణంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండడం తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. సదరు అధికారులు పక్కాగా నియంత్రించినట్లయితే మండలం లో మరో  వైన్ షాప్ తెరవడానికి అవకాశం ఉండేది. దీంతో ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరేదని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బెల్టు షాపుల దందాను నియంత్రించాల ని ప్రజలు కోరుతున్నారు.