calender_icon.png 23 December, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండ్రెడ్డిపల్లి సర్పంచ్ గా దోమలపల్లి యాదమ్మ ప్రమాణ స్వీకారం

23-12-2025 10:01:29 AM

తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డీపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సెక్రెటరీ దోమలపల్లి యాదమ్మ చేత నూతన సర్పంచిగా ప్రమాణం చేయించారు. ఉప సర్పంచ్ గా మన్నే చంద్రకళ ప్రమాణం చేశారు. వీరితోపాటు గ్రామంలోని వివిధ వార్డుల సభ్యులు ప్రమాణం చేయడం జరిగింది. ఇందులో తూప్రాన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.