23-12-2025 11:07:00 AM
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్: మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్(Mahabubnagar Deputy Transport Commissioner)పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై ఏసీబీ సోదాలు(Anti-Corruption Bureau) చేస్తోంది. డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ కిషన్ నాయక్ నివాసాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి లోని నివాసాల్లో సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉన్నాయి.