23-12-2025 11:54:09 AM
హైదరాబాద్: పదవీ బాధ్యతలు చేపట్టిన గ్రామపంచాయతీ పాలకవర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు రేవంత్ రెడ్డి అభినందించారు. మంచిపాలన అందించి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఇటీవల తెలంగాణలో మూడు విడతల్లో జరిగిన సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సోమవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. ''రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లుగా, ఉప సర్పంచ్ లుగా, వార్డు మెంబర్లు గా బాధ్యతలు స్వీకరించిన సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్ది, మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను.'' అంటూ సీఎం ఎక్స్ లో పేర్కొన్నారు.