23-12-2025 10:39:55 AM
హైదరాబాద్: హయాత్‌నగర్(Hayathnagar)లో స్థానికులు ఆందోళన చేపట్టారు. విజయవాడ జాతీయ రహదారిపై(Vijayawada Highway) సమీప కాలనీవాసులు దర్నా చేస్తున్నారు. విజయవాడ జాతీయ రహదారిపై ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. జాతీయ రహదారి విస్తరణలో(National highway expansion) లోపాలు వల్ల తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుదాటుతుండగా వాహనాలు ఢీకొన్న ఘటనల్లో పలువురు మృత్యువాతపడ్డారు. ఇటీవల రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని వైద్య విద్యార్థిని మృతి చెందింది.
రోడ్డు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు(Foot overbridges) లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్లు, సమీప కాలనీవాసుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి(Hayathnagar Corporator Navajeevan Reddy), మన్సురాబాద్ కార్పొరేటర్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణంలో లోపాలు సరిచేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ధర్నా వల్ల విజయవాడ హైవే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళన కారులను అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.