23-12-2025 12:07:42 PM
హైదరాబాద్: గ్రూప్-1 అప్పీలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) విచారణ జరిగింది. గ్రూప్-1 ఫలితాలపై(Group-1 Results) దాఖలైన పిటిషన్లపై సీజే ధర్మాసనం విచారించింది. గ్రూప్-1 సెలక్షన్ లిస్టును(Group-1 Selection List) రద్దు చేస్తూ సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పత్రాలు పున:మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ, పలువురు అభ్యర్థులు అప్పీలు చేశారు. మెయిన్స్ మూల్యాంకనం పారదర్శకంగా జరిగిందని ఏజీ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై గతంలోనే సీజే ధర్మాసనం స్టే విధించింది. గ్రూప్-1 నియామకాలు చేపట్టవచ్చని సీజే ధర్మాసనం చెప్పింది. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని సీజే ధర్మాసనం తెలిపింది.