23-12-2025 09:59:48 AM
ప్రజల ప్రజలకు రుణపడి ఉంటా
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కృష్ణ పల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి మూడోసారి సర్పంచ్(Sarpanch)గా గెలిపించిందని గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి లావణ్య శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు పల్లె ప్రకృతి వనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గ్రామంలో చేసిన అభివృద్ధి ముచ్చటగా మూడోసారి గ్రామ ప్రజలు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించారని గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకుని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని వారు సభాముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామ్మోహన్, గ్రామ కార్యదర్శి రోజా, కరోబార్ సుధాకర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.