calender_icon.png 21 November, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామాలయం భూముల్లో అక్రమ నిర్మాణాలు

16-08-2024 08:06:11 PM

అడ్డుకుంటున్న దేవాదాయ సిబ్బందిపై ఎదురు దాడి

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి చెందిన దేవాదాయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. పురుషోత్తం పట్టణంలోని దేవాదాయ భూముల్లో కొందరు అక్రమణదారులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఈవో ఎల్ రమాదేవి తన సిబ్బందితో శుక్రవారం పురుషోత్తం పట్నం వెళ్లి అక్రమ నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా, అక్రమణదారులు దేవాదాయ ధర్మాదాయ సిబ్బందిపై ఎదురుదాడికి దిగి నిర్మాణాలను అడ్డుకుంటున్న వారుతో వాగ్వాదానికి దిగారు.